మారుతున్న కాలం పోటీ ప్రపంచంలో క్షణం తీరిక లేకుండా కాలంతో పరుగులు తీస్తున్న జనాలు కాస్త సెలవు దొరికితే చాలు రిలాక్స్ అయ్యేందుకు పార్కులు, దేవాలయాలు సందర్శించేవారు. అది నాటి మాట. నేడు వీకెండ్ అంటే పబ్బులకు పరుగులు తీయాల్సిందే. అర్థరాత్రి వరకు మద్యం మత్తులో చిందులు తొక్కే పబ్బులు వివాదాలకు వేదికగా మారుతున్నాయి. వారంలో అయిదు రోజులపాటు క్షణం తీరిక లేకుండా డ్యూటీలంటూ పరుగులు తీస్తున్న యువతరం వీకెండ్ వచ్చిన, హాలిడే వచ్చిన హాయిగా సేదతీరేందుకు స్నేహితులతో కలిసి పబ్బులకు వెళుతున్నారు. చెవులకు చిల్లులు పడే రిథమ్ మధ్య మందేసి చిందులేస్తుంటే ఆ ఆనందానికి అవదలు ఉండవు. యువతకు క్రేజ్‌గా మారిన పబ్బులు నగరంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రతిరోజు అర్థరాత్రి వరకు శబ్ధకాలుష్యాన్ని పెంపొందించే పబ్బులు సైతం వివాదాలకు వేదికగా మారుతున్నాయి. రిలాక్స్ అవుదామని వచ్చి యువతీ యువకులు మద్యం మత్తులో వికృత చేష్టలు చేస్తూ పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. ఆర్క్సెస్ట్రా ముసుగులో అర్థనగ్న నృత్యాలు సాగుతున్నాయన్న సాకుతో ప్రభుత్వం ఆర్కెస్ట్రా బార్‌లను నిషేదించింది. దీనిపై అనేక మంది బార్ యజమానులు ప్రభుత్వానికి పలు మార్లు విన్నవించుకున్నా ససేమిరా అంటూ వారి ఫైల్ తోసిపారేసింది. అయితే తాజాగా పబ్బులు వ్యవహారానికి వస్తే మాత్రం ప్రభుత్వానికి, పోలీసులకు నోళ్లు ఊరిస్తున్నాయి. అర్థరాత్రి మూడుగంటలైన హాయిగా సౌండ్ పొల్యూషన్ చేసిన వారికి మాత్రం వద్దాన్న పరుగులు తీసి మరీ పర్మీషన్లు ఇస్తోంది. రిలాక్స్ అంటూ సాగే పబ్బులు విషసంస్కృతులకు దారితీస్తున్నాయి. చాలీచాలని దుస్తులతో, అందరిని ఆకట్టుకోవాలని అమ్మాయిలు చేసే ప్రయత్నాలు, ఎదుటి వారికి ధీటుగా దమ్ము, రమ్ము లాగిన టేక్ ఇట్ ఈజీ అంటున్నారు. అర్థరాత్రి వరకు చెవులు చిల్లుపడి శబ్ధకాలుష్యాన్ని పెంపొందిస్తున్న పోలీసులు ఒక్క కేసు పెట్టిన దాఖలాలు లేవు. పబ్ యాజమాన్యాలు ఇచ్చే కాసులకు కర్తిపడే కాకీలు మాత్రం పార్కింగ్ లేక పోయినా నో ప్రాబ్లం అంటూ తమ వంతు రిపోట్‌ను ప్రభుత్వానికి అందజేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానా, జైలుశిక్ష అని గంటల తరబడి పాఠాలు చెప్పే ట్రాఫిక్ అధికారులు మాత్రం విఐపీ జోన్‌గా మారిన జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ వైపు అర్థరాత్రి రావాలంటే కాస్త భయమనే చెప్పాలి. తాజాగా జూబ్లిహిల్స్‌లోని పాయిజన్ పబ్బులో కవరేజ్ నిమిత్తం వెళ్లిన మీడియా ప్రతినిథులపై అక్కడి నిర్వహకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు ఆందోళనకు దిగితేగాని పోలీసులు స్పందించలేదు. వివాదాలకు వేదికగా మారి ప్రాణాలమీదకు వస్తున్న ఇలాంటి కల్చర్‌ను ప్రభుత్వం, పోలీసులు అరికట్టాల్సి అవసరం ఉందని జనం కోరుతున్నారు.
వివాదాలకు వేదికగా మారుతున్న పబ్బులు

లోడ్ అవుతోంది...